SRCL: వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పేరుతో భక్తులకు దర్శనం నిలిపివేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నేతృత్వంలో నాయకులు ఆలయ ఈవో రమాదేవికి వినతిపత్రం అందజేశారు. దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో దర్శనం నిషేధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, అభివృద్ధి పనులతో పాటు దర్శనం కొనసాగించాలని డిమాండ్ చేశారు.