HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శనాస్త్రాలతో టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు బాకీ కార్డు అంటూ BRS పార్టీ ఓటర్లలోకి వెళ్తోంది. BJP సైతం కాంగ్రెస్ గుర్తుపై మజ్లీస్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో BRS, BJP ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది.