MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు వస్తున్న కారును వెనుకనుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన సిద్దయ్య, కమలా దంపతులు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.