KNR: కరీంనగర్ టౌన్ డివిజన్లోని కొరియర్, కార్గో కేంద్రాల్లో ఇవాళ పోలీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ స్వయంగా బస్టాండ్, ఆర్టీసీ కార్గో కార్యాలయాలను పర్యవేక్షించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.