కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘ఓట్ల చోరీ’ అంశానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సూచించింది.