కృష్ణా: కల్తీ మద్యం అమ్ముతున్న కూటమి ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలువు మేరకు పెడన తహసీల్డార్కు వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం పెడన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కల్తీ మద్యాన్ని ఆరికట్టాలని కోరారు.