WGL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు అక్టోబర్ 23 వరకు గడువు ఉందని WGL యూనిక్ కోఆర్డినేటర్ సమీ ఉల్లాబేగ్ ఇవాళ తెలిపారు. విద్యార్హతలు లేకుండా టెన్త్, టెన్త్ ఉత్తీర్ణులు ఇంటర్లో చేరవచ్చని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో చదువుకునే అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు 7396135390 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.