ADB: బజార్హత్నూర్ అటవీ ప్రాంతంలోని దాద్రా గిర్ణయ్ గ్రామాలకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, సరుకులు తరలించడానికి, అత్యవసర సమయాల్లోనూ కష్టంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. వెంటనే రోడ్డు నిర్మించాలని అధికారులను కోరారు.