MLG: తాడ్వాయి మండలం మేడారం వనదేవతల ఆలయ ఆధునీకరణ పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతర పనుల సమీక్షకు మేడారం రానున్నారు. అయితే, మంత్రి కొండా సురేఖ ఆయన పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన పై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.