KMM: రిటైర్ ఉద్యోగుల పెన్షనరీ బకాయిలను చెల్లించకుండా గత 17 నెలల నుండి మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని రిటైర్ ఉద్యోగులు మండిపడ్డారు. ఈ నెల 13న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కళ్యాణం కృష్ణయ్య ఎం. సుబ్బయ్య ఆదివారం తెలిపారు.