బహుశా ఊహించని విజయం అంటే ఇదేనేమో.. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార మూవీ.. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని.. ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ కాంతార ఓ సెన్సేషన్‌గా నిలిచింది. అక్కడ, ఇక్కడ అని కాదు.. అంతటా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది కాంతార. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లో రన్ అవుతునే ఉంది.
అయినా కూడా.. ఓటిటిలోకి ఎప్పుడొస్తుందని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా వరాహ రూపం సాంగ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ కాంతార ఓటిటి వెర్షన్ ఊహించని షాక్ ఇచ్చింది. తాజాగాఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ లోకి వచ్చేసింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటిటిలో ఈ సినిమా చూసి అసలైందే మిస్ అయిందంటున్నారు.
వరాహా రూపం పాట కోసమే సినిమా చూడాలనుకున్న వారు మరింత నిరాశకు గురవుతున్నారు. కాంతార క్లైమాక్స్‌లో వచ్చే వరాహ రూపం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అసలు ఈ పాట లేకుండా సినిమాను ఊహించుకోలేం. థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించింది వరాహ రూపం సాంగ్. కానీ ఓటిటిలో మాత్రం ఈ పాట లేదు. ఈ సాంగ్‌కు బదులుగా మరొక పాటను చేర్చింది చిత్ర యూనిట్. దాంతో కాంతార చూసి డిసప్పాయింట్ అవుతున్నారు ఆడియెన్స్.
గతంలో తైక్కుడం బ్రిడ్జ్ అనే మళయాళి మ్యూజిక్ బ్రాండ్ వారు ‘వరాహ రూపం’ సాంగ్ కాపీ చేశారని కోర్టుకెక్కారు. దాంతో కోర్టు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఆ పాటను ఉపయోగించకుండదని షేధించింది. అందుకే ఇప్పుడు ఓటిటిలో ఈ పాటను తీసేశారు. దాంతో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పై కాస్త ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఏదేమైనా.. ఓటిటిలో కాంతార సోల్ మిస్ అయిందనే చెప్పాలి.