NLG: నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ 5వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆయన సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.