KMM: ప్రధాన మంత్రి కిసాన్ ధన్ ధనియా కృషి యోజన లైవ్ కార్యక్రమాన్ని ఖమ్మం మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు శనివారం తిలకించారు. సుమారు రూ.42వేల కోట్ల విలువైన వ్యవసాయ ప్రయోజన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను రైతులు వీక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ యారగర్ల హనుమంతరావు,వైస్ ఛైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం ఏ ఆలమ్ పాల్గొన్నారు.