NLG: సూర్యాపేట తుంగతుర్తిలో నేడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ట్రాఫిక్ ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. జాతీయ రహదారి 365పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నకిరేకల్, మరిపెడ బంగ్లా మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు.