RR: రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్, మహేశ్వరం సహా అనేక ప్రాంతాల్లో పత్తి పండించిన రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, పత్తికాయల నుంచి మొలకలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.