BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం PACS ఛైర్మన్ మేకల సంపత్ కుమార్ ఆధ్వర్యంలో BRS నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి మరిచిందన్నారు. BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.