ప్రకాశం: మార్కాపురంలో ఒక ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి, అతని ఆటోను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. దొనకొండకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి రూ.600 కిరాయికి ఆటో మాట్లాడుకుని, మార్కాపురం నుంచి మల్లంపేట మీదుగా దొనకొండకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. డ్రైవర్‌ను కిందకు తోసేసి,ఆటోతో పరారైన వ్యక్తిపై బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప చేపట్టారు.