ATP: కూటమి ప్రభుత్వం, రైతుల సమస్యలపై స్పందించడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. విత్తనాల కొరత, ఎరువులు అందుబాటులో లేకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ ఆలస్యం వల్ల రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ మొదలైందని, విత్తనాలను 50% సబ్సిడీతో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.