GNTR: గుంటూరు జీజీహెచ్‌ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించి, వైద్య సేవల అందుబాటు, మందుల నిల్వలపై సమీక్ష నిర్వహించారు. బీసీ వసతి గృహ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పర్యవేక్షకుడు రమణ తెలిపారు.