Anushka-Prabhas:ప్రభాస్ (Prabhas)- అనుష్కల (Anushka) మధ్య ఏదో ఉందని గుస గుసలు వినిపిస్తాయి. వారిద్దరూ కలిసి బాహుబలి తర్వాత మరో సినిమా చేయలేదు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాగా.. ప్రేమ, పెళ్లి గురించి ఒక్కటే చర్చ. ఫ్యాన్స్ అడిగి అడిగి ఊరుకున్నారు. దానికి తగ్గట్టు ప్రభాస్ (Prabhas) పెళ్లి చేసుకోకపోవడంతో చర్చకు వచ్చింది. ఇప్పుడు తాజాగా వారికి సంబంధించి డిస్కషన్ వచ్చింది.
అనుష్క (Anushka) కొత్త మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. మూవీ పోస్టర్‌ను డార్లింగ్ ప్రభాస్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. దీనికి అనుష్క (Anushka) స్పందించింది. థాంక్స్ పప్స్ అని కామెంట్ చేసింది. ప్రభాస్ (Prabhas)- అనుష్క (Anushka) ఏమని పిలుచుకుంటారో తెలియదు.. ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడంతో చర్చ జరుగుతుంది.
ప్రభాస్‌ను (Prabhas) అనుష్క (Anushka) ముద్దుగా పప్స్ (PUPSUUU) అని పిలుస్తోందని.. అందుకే అలా రాసిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వారి మధ్య ఏదో ఉందా..? ప్రేమ, పెళ్లి అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. అబ్బే అదేం లేదని ఎప్పటిలానే చెప్పి ప్రభాస్ (Prabhas)- అనుష్క తప్పించుకుంటున్నారు.
ప్రభాస్ (Prabhas) కొత్త మూవీ ఆదిపురుష్.. ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న కృతి సనన్‌తో ప్రభాస్ (Prabhas) ప్రేమలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరూ కలిసినా.. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఒక్కటే రూమర్లు. అదేం లేదని వారిద్దరూ కూడా తెలిపారు. పెళ్లిపై ప్రభాస్ (Prabhas) తేల్చకపోవడంతో ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు.