రంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి తెలిపారు. పట్టణ ప్రాంతంలో 1,99,967 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 2,20,944 మంది చిన్నారులు ఉన్నారని, 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె పేర్కొన్నారు.