జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్లో నిన్న నార్కోటిక్ డాగ్, బీడీ టీం, పోలీసు సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ పీ. కరుణాకర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ తనిఖీలు పట్టణంలో రద్దీగా ఉండే కొత్త బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో జరిగాయి.