KMM: ముదిగొండ మండలం పెద్ద మండవ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బైక్ను ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో పెద్దమండవకు చెందిన గొర్రె మచ్చు సనా(9), పేరం ప్రవీణ్ (14), అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మరో వ్యక్తి సాయికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రి కి తరలించారు.