TG: పాఠశాల విద్యలో అమలవుతున్న సమగ్ర శిక్షా ప్రాజెక్టును ఇంటర్ వరకు అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, రవాణా ఛార్జీలను సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా కేంద్రం అందిస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకూ అమలు చేయాలని ప్రతిపాదించింది.