తడ మండలం ఎంఈవో కార్యాలయంలో శుల్రవారం బ్లూ స్టార్ సితార సృష్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన బ్యాంకింగ్ శిక్షణ కార్యక్రమంలో 82 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన జాబ్ మేళాలో 55 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.