కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారుచేసి మహిళల తాళిబొట్టు తెంచేస్తోందని వైసీపీ మహిళలు మండిపడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ నందు ఎక్సైజ్ కార్యాలయం వరకు మద్యం బాటిళ్లతో ర్యాలీ చేపట్టారు. కాగా, అడ్డంగా దొరకడంతో కల్తీ మద్యంపై చంద్రబాబు నోరు మెదపడం లేదని, పవన్ పత్తా లేకుండా పోయారని బద్వేలు ఎమ్మెల్యే డా.సుధా ఆరోపించారు.