ATP: కుందుర్పి మండల కేంద్రంలోని కుందుర్పమ్మ గ్రామ దేవత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు రెండు కన్నులతో భక్తులను తెరిపార చూస్తూ ఉన్నట్లు భక్తులకు ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు.