SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం మరోసారి లడ్డు వివాదంలో చిక్కుకుంది. తాము కొనుగోలు చేసిన లడ్డూలు దుర్వాసన వస్తున్నాయనీ శుక్రవారం కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు ఆలయంలోని లడ్డు విక్రయ కేంద్రానికి చేరుకుని లడ్డూలను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.