తిరుపతి: 9 రోజుల పాటు వైభవంగా సాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల పనితీరుపై తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. TTD, పోలీసులలోని వివిధ విభాగాల పనితీరు, ఎదుర్కొన్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుందని SP సుబ్బారాయుడు, TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సూచించారు.