TG: ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో.. ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి ఏం చేయాలనే దానిపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలు, నిర్వహించడంలో ఉన్న అవరోధాల గురించి ఆరా తీయనున్నారు.