ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘కాంతార’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. అసలు కన్నడలో సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ.. ఈ స్థాయిలో హిట్ అవుతుంని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఓవరాల్‌గా 400 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. కర్ణాటకలో 168 కోట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లు.. హిందీలో 96 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఓవర్సీస్తో పాటు మిగతా రాష్ట్రాల్లోను కాంతారా దుమ్ముదులిపింది. సాలిడ్ కంటెంట్ ఉంటే.. సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో చెప్పడానికి కాంతార సినిమా ఒక్కటి చాలంటన్నాఉ.
అయితే పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా సత్తా చాటడంతో.. ఫుల్ ఖుషి అవుతున్నారు కన్నడ వాసులు మరియు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్. కానీ కన్నడ రికార్డు విషయంలో కెజీయఫ్ 2 ఫ్యాన్స్.. అంటే యష్ ఫ్యాన్స్, కాంతార అభిమానులు గొడవ పడుతున్నారు. కర్ణాటకలో కెజియఫ్2కి 171 కోట్లు వచ్చాయి.. కాంతార సినిమాకు 168 కోట్లు వచ్చాయి.
కానీ కాంతార ఫ్యాన్స్ ఈ కలెక్షన్లు ఫేక్ అంటున్నారు. కర్ణాటకలో కాంతారా 185 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిందని.. కానీ దాన్ని తక్కువగా చూపిస్తున్నారని అంటున్నారు. అయినా కూడా త్వరలోనే కె.జి.యఫ్ చాప్టర్ 2 రికార్డ్‌ను కాంతార బద్దలు కొడుతుందని అంటున్నారు. మొత్తంగా.. ఇప్పుడు కన్నడలో కాంతార వర్సెస్ కెజియఫ్2 ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోందని చెప్పొచ్చు.