»Drinks In Summer Diet To Stay Away From Constipation
Health Tips: మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా…? ఇవి ప్రయత్నించండి..!
ఈరోజుల్లో మలబద్దకం సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, అనుసరించే లైఫ్ స్టైల్ కారణంగా కూడా మలబ్దకం సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల తిన్న ఆహారం అరగకపోవడం, ఆకలివేయకపోవడం లాంటివి అనేక సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల ఆహారాలు , ముఖ్యంగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదంలో మలబద్ధకాన్ని తగ్గించడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. 1. బ్లాక్ రైసిన్లు:
ఇది వాతాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల ఇది గ్యాస్, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని శీతలీకరణ ప్రభావం పిట్టా, ఆమ్లతను తగ్గిస్తుంది. 20 నల్ల ఎండుద్రాక్షలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీరు తాగి, నానపెట్టిన రైసిన్స్ ని కూడా తినేయాలి.
2.మెంతుల నీరు:
రాత్రిపూట ఒక స్పూను మెంతులు నానపెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఈ నీటిని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకుంటే మలబద్దకం సమస్య తగ్గడం తో పాటు, రక్తంలోని చెక్కర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
3.ఆప్రికాట్.:
ప్రతిరోజూ ఉదయాన్నే ఆప్రికాట్ తీసుకోవాలి. వీటిని రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇలాచేయడం వల్ల కూడా మల బద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు.
4.చియాసీడ్స్:
చాలా మందికి ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీంతో నొప్పులు ఉంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు చియా సీడ్స్ ఆ సమస్యని దూరం చేస్తాయి. అందుకోసం రాత్రి చియా సీడ్స్‌ని ఓ గ్లాసు నీటిని నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని తాగితే సమస్య పరిష్కారమవుతుంది. అంతేకాకుండా, మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.