TG: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మాజీమంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పండుగ పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆర్టీసీ ఆగమైంది. ఇప్పుడు మెట్రోను కూడా ఆగం చేయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. ఇదంతా ఆర్టీసీని అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. దీనిపై ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించామని తెలిపారు.