కాకినాడ: జగ్గంపేట మండలం మామిడాడ ఇరుపాక మర్రిపాక గ్రామాలలో 3500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏలేరుపై రూ. 3.49 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం సాయంత్రం పోలవరం ఈ ఈశ్రీనివాస్తో కలిసి ఈ పనులకు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు త్వరలో రాష్ట్ర మంత్రితో శంకుస్థాపన చేస్తామని ఆయన పేర్కొన్నారు.