TPT: శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా హరీంద్రనాధ్ నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న లోకనాధంను తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయానికి బదిలీ చేశారు. ఆర్1 డిప్యూటీ ఈవోగా నియమితులైన రాజేంద్ర, ఆర్2 ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. తిరుమల అన్నదానం డిప్యూటీ ఈవోగా సెల్వం, కల్యాణ కట్ట డిప్యూటీ ఈవోగా గోవింద రాజన్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.