KDP: జిల్లా యోగివేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బెల్లంకొండ రాజశేఖర్‌ను అధికారులు నియమించారు. కొన్ని నెలలుగా ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా ఇన్ఛార్జ్ ఉండటంతో నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న బెల్లంకొండ రాజశేఖర్‌ను నియమించారు.