NDL: మొక్కజొన్న పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని నందికొట్కూరు (సీపీఐ) ఏంఎల్ లిబరేషన్ పార్టీ నాయకుడు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ప్రకటించింది అని తెలిపారు. అయితే దళారులు, వ్యాపారస్తులు కుమ్మక్కై 2,000 రూపాయలకే కొనుగోలు చేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారన్నారు.