WGL: గ్రేటర్ వరంగల్ 34, 35 డివిజన్లలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానిక డివిజన్ ప్రజలు అంటున్నారు. శివనగర్ లోని హనుమాన్ వీధిలో కోతులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందరగా చేస్తున్నాయని, పిల్లలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కోతుల బెడద తొలగించాలని కోరుతున్నారు.