SKLM: బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అఖిల్‌ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభినందించారు. ఇటీవల తమిళనాడులో దిండిగల్‌లో జరిగిన జాతీయస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీల్లో ఆంధ్ర జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జట్టులో నరసన్నపేట ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అఖిల్ పాల్గొన్నాడు.