SKLM: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం టెక్కలిలో దళిత, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన తెలిపి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ ప్రతినిధులు ఉన్నారు.