BDK: కొత్తగూడెంలో ప్రకాష్‌నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలు విధానాలను సమీక్షించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పిల్లలకు సమయానికి ఆహారం, అందజేయాలని ఆదేశించారు.