W.G: అందరూ మెచ్చుకునేలా ప్రతి అంగన్వాడీ సెంటర్లలోని టీచర్లు పని చేయాలని భీమవరం ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి అన్నారు. తల్లిపాలు, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు ఏ విధంగా ఉంటారో అనే అంశంపై బుధవారం భీమవరంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులను టీచర్లకు చూపించి వారి సమస్యలను వివరించారు.