MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా దుకాణంలో అక్రమ మద్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. కిరాణా దుకాణంలో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేసినట్టు వివరించారు. దాడుల్లో 120.150 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని, నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.