ATP: పుట్లూరు రూరల్ సీఐ సత్యబాబును బుధవారం జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమావేశంలో పుట్లూరు సీఐ సత్యబాబు పాల్గొన్నారు. ‘Best performance of the month’ గా సీఐ సత్య బాబును అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నారు.