BPT: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉంచేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల పర్యవేక్షణకు ప్రతి మండలంలో నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వామిత్వ సర్వేను 100 శాతం పూర్తి చేయాలన్నారు.