సత్యసాయి: నల్లమాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2020 డిసెంబరులో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు బండి ఆదినారాయణకు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5వేల జరిమానా పడింది. ఈ మేరకు అనంతపురం పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.