GNTR: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘డ్రోన్ గస్తీ’ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లపాడు డంపింగ్ యార్డ్లో పేకాట ఆడుతున్న ముగ్గురిని సీఐ రామానాయక్ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.16,900 నగదును సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.