గుంటూరు: నగర రాకపోకలకు కీలకమైన జీటీ రోడ్డు (మార్కెట్ సెంటర్ నుండి చుట్టుగుంట వరకు) నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. బుధవారం కలెక్టర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ఈ విషయంపై చర్చించారు. భారీ వర్షాల కారణంగా రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.