W.G: అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నరసాపురం డీఎస్పీ శ్రీవేద హెచ్చరించారు. బాణసంచా విక్రయ కేంద్రాల్లో వాటర్ డ్రమ్ములు, బకెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తున్నా, అనుమతి లేకుండా నిల్వ చేస్తున్నా 112, 100 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.