KNR: గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య నిన్న ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన భార్య లక్ష్మి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. శంకరయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు చేస్తున్నామన్నారు.